బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 30 నవంబరు 2018 (13:25 IST)

తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులే కింగ్ మేకర్లు : ఆంధ్రా ఆక్టోపస్

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ డిసెంబరు 7వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో అనేక అసెంబ్లీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయభేరి మోగిస్తారని తెలిపారు. కనీసం 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని ఆయన జోస్యం చెప్పారు.
 
శుక్రవారం తిరుమలలో మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తమ బృందం అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేస్తోందన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. అదేసమయంలో ఈ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందుతారని తెలిపారు. 
 
గెలుపొందే అభ్యర్థుల జాబితాను ఇద్దరు పేర్ల చొప్పున వెల్లడిస్తానని తెలిపారు. అలా గెలిచేవారిలో అదిలాబాద్ జిల్లా బోథ్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థి అనిల్ జాదవ్, మహబూబ్ నగర్ నారాయణపేట అసెంబ్లీ స్థానంలో బీఎల్ఎఫ్ అభ్యర్థి శివకుమార్‌లు గెలుపొందుతారని తెలిపారు. 
 
డిసెంబరు 7వ తేదీ సాయంత్రం పూర్తి ఫలితాలను వెల్లడిస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందనుండటం స్వాగతించదగ్గ విషయమన్నారు. ఇది ఓ శుభసూచకమని తెలిపారు.