1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Modified: బుధవారం, 21 నవంబరు 2018 (21:38 IST)

కొండా వికెట్ ఎందుకు పడింది.. కేటీఆర్ ఏమన్నారు..(Video)

టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు.. ఆ వీడియో మంచి ఊపు మీదున్న టీఆర్ఎస్ పార్టీని ఒక్క కుదుపు కుదిపింది. అంతేకాదు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదిహేను రోజుల క్రితమే రేవంత్ రెడ్డి డిసెంబర్ 27 లోపు టీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు ఎంపీ వికెట్లు పడుతున్నాయని దమ్ముంటే ఆపాలని టీఆర్ఎస్ అగ్రనేతలకు సవాల్ విసిరారు. 
 
అయితే అటువంటిది ఏదీ లేదని విశ్వేశ్వర రెడ్డి ఖండించినా సీన్ మళ్లీ రివర్స్ అయింది. విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి రాహుల్ గాంధీని కలిసారు. ఈ నెల 23న సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే ఆయన రాజీనామా వెనుక కారణమేంటన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోన్న ప్రశ్న. పట్నం మహేందర్ రెడ్డితో వేగలేకనే ఆయన పార్టీ నుంచి తప్పుకున్నారన్న వాదన దానికి బదులుగా వినిపిస్తోంది.
 
పట్నంకు దక్కినంత గుర్తిపుం గౌరవం తనకు దక్కవపోవడం... అధినాయకుడు కేసీఆర్ కూడా పెద్దగా పట్టించుకోలేకపోవడం, అనుచరులకు నామినేటేడ్ పదవులు దక్కకపోడంతో ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. అయితే విశ్వేశ్వర రెడ్డిని బుజ్జగించేదుకు స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, మీరు పార్టీ మారితే ఇబ్బంది పడతారని  కేటీఆర్ స్వయంగా విశ్వేశ్వర రెడ్డి ఇంటికి వెళ్లి చెప్పినా ఖాతరు చేయలేదు. చూడండి ఆయన మాటల్లోనే...