బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By వరుణ్
Last Updated : శనివారం, 25 నవంబరు 2023 (10:16 IST)

హైదరాబాద్ నుంచి ఏ ప్రాంతానికైనా గంట లోపే ప్రయాణం.. ఎక్కడ?

rapid rail
తెలంగాణాలో దూర ప్రాంతాలకు వేగవంతమైన ప్రజా రవాణా సదుపాయాల కల్పనపై భారత రాష్ట్ర సమితి దృష్టిసారించింది. హైదారాబాద్ నుంచి ఏ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా గంటలో చేరుకునేలా ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ కారిడార్లను ప్రతిపాదించింది. ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం విస్తరించేందుకు ఇది బాగా దోహదం చేస్తుందని భావిస్తున్నారు. హైదరాబాద్ విజన్ 2047 పేరుతో ఐటీ మంత్రి కేటీఆర్ ప్రజంటేషన్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఈ కారిడార్లను వివరించారు. ఓఆర్ఆర్ వరకు మెట్రో, అక్కడ నుంచి ర్యాపిడ్ రైల్ తీసుకొస్తామని తెలిపారు. 
 
1. శామీర్ పేట (ఓఆర్ఆర్) - గజ్వేల్ - కొమరవెల్లి  - సిద్దిపేట - కరీంనగర్ 140 కిలోమీటర్లు 
2. ఘట్‌కేసర్ (ఓఆర్ఆర్) - బీబీ నగర్, యాదాద్రి, జనగాం, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్‌పూర్ - వరంగల్ 113 కిలోమీటర్లు
3. పెద్ద అంబర్ పేట (ఓఆర్ఆర్)
i). చౌటుప్పల్ - చిట్యాల్, నార్కట్ పల్లి, నల్గొండ 81 కిలోమీటర్లు
ii). నార్కట్ పల్లి - నకిరేకల్ - సూర్యాపట, కూసుమంచి, ఖమ్మం 111 కిలోమీటర్లు 
6. శంషాబాద్  (ఓఆర్ఆర్) - షాద్ నగర్, జడ్చర్ల, పాలమూరు  50 కిలోమీటర్లు 
7. అప్పా - మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్ 60 కిలోమీటర్లు 
8. ముత్తంగి (ఓఆర్ఆర్) - ఇస్నాపూర్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ 64 కిలోమీటర్లు 
9. కండ్లకోయి (ఓఆర్ఆర్)
i). మేడ్చల్ - మనోహరాబాద్, మాసాయి పేట, చేగుంట, మెదక 70 కిలోమీటర్లు 
ii). చేగుంట - రామాయంపేట, బిక్‌నూర్, కామారెడ్డి, డిచ్‌పల్లి, నిజామాబాద్ 103 కిలోమీటర్లు