గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (22:22 IST)

రేవంత్ రెడ్డి ప్రేమకథ.. నెట్టింట వైరల్.. గీతారెడ్డి ఎవరో తెలుసా?

revanth reddy couple
తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం నెట్టింట రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత విశేషాలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ చక్కర్లు కొడుతోంది. గీతా రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రేవంత్ రెడ్డి. వీరిద్దరి పెళ్లి వెనుక సినిమాలను మించిన ట్విస్టులు ఉన్నాయి.
 
రేవంత్ రెడ్డి ప్రేయసి ఎవరో కాదు.. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకులు జైపాల్‌ రెడ్డి తమ్ముడి కుమార్తె. కాలేజీ రోజుల్లోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే క్రమంలో వీరికి ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయట. 
 
స్టూడెంట్స్ లీడర్‌గా వుంటూనే గీతారెడ్డితో ప్రేమాయణం కొనసాగించిన రేవంత్ రెడ్డికి మామగారి నుంచి ఇబ్బందులు వచ్చాయట. అయితే గీతారెడ్డి - రేవంత్ రెడ్డి ఇద్దరూ గట్టిగా నిలవడంతో పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. మొత్తానికైతే అలా తాను ప్రేమించిన అమ్మాయి గీతా రెడ్డిని రేవంత్‌రెడ్డి పెళ్లి చేసుకున్నారు.