గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By వరుణ్
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (18:02 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : అన్ని సర్వేలు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలం

telangana assembly poll
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగిస్తుందని గురువారం సాయంత్రం వెల్లడైన అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించాయి. చాణక్య, సీఎన్ఎన్, ఆరా వంటి సర్వే సంస్థలతో పాటు అన్ని సర్వే సంస్థల తెలంగాణాలో హస్తం వహా కొనసాగుతుందని వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 60 నుంచి 65, బీఆర్ఎస్‌కు 40 నుంచి 45, భారతీయ జనతా పార్టీకి 5-7, ఇతరులకు 5-8 వరకు సీట్లు వస్తాయని వెల్లడించాయి. 
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీకి 41 నుంచి 49, కాంగ్రెస్‌కు 48 నుంచి 67 స్థానాలు, భారతీయ జనతా పార్టీకి 5 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశముందని తెలిపింది. ఇతరులు రెండు స్థానాల్లో గెలిచే అవకాశముందన్నారు. ఎంఐఎం 6 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొన్నారు.
 
మరోవైపు, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయం ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 80.28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.97 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతించారు. దీంతో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.