శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (05:02 IST)

కేసీఆర్‌ ఇంకా తిరుమల చేరలేదు.. అప్పుడే రగడ మొదలైపోయిందా?

2010లో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో టీఆర్‌ఎస్‌ అధినేత హోదాలో కేసీఆర్‌ తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా దీవించాలని వేడుకున్నారు. ఆ మొక్కులను తీర్చేందుకు ఏడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ తొలిసారి త

తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) మంగళవారం తిరుమల దర్శనార్థం రానున్న నేపథ్యంలో సోమవారం రేణిగుంట ఎయిర్‌పోర్టు మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్ల తొలగింపు వివాదాస్పదమైంది. మొక్కు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో కలసి తిరుమల రానున్న కేసీఆర్‌ను స్తుతిస్తూ తమిళనాడు తెలుగు యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఎయిర్‌పోర్టు మార్గంలో ఫ్లెక్సీలను, రోడ్డు పక్కన వాల్‌పోస్టర్లను ఏర్పాటు చేశారు.
 
అయితే ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదంటూ అధికారులు తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న కేతిరెడ్డి సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకుని తన అసంతృప్తి వెలిబుచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్ర సీఎంకు మనమిచ్చే అతిథి మర్యాద ఇదా అని ఆయన ప్రశ్నించారు.
 
శ్రీవేంకటేశ్వరస్వామికి తెలంగాణ మొక్కులు తీర్చేందుకు ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం తిరుమలకు బయల్దేరనున్నారు. ముఖ్య మంత్రి వెంట ఆయన కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సల హాదారులు, అధికారులు వెళ్తున్నారు. సీఎం పర్యటనకు రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు సైతం భారీగా తరలి వెళ్తున్నాయి. పలువురు రోడ్డు మార్గంలో తిరుపతికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి మంగళ వారం సాయంత్రం తిరుపతి చేరుకుం టారు. కొండపైకి చేరుకొని రాత్రి తిరుమలలో బస చేస్తారు. బుధవారం ఉద యాన్నే తిరుమలేశున్ని దర్శించుకుంటారు.
 
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల విలువైన కానుకలను శ్రీవారికి ముఖ్యమంత్రి సమర్పిస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కిన మొక్కులను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందటే నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలోనే రూ.5 కోట్ల విలువైన ఆభరణాల ను తయారు చేయించింది. శ్రీ మూల వర్ణ కమలం నమూనాలో 14.2 కిలోల సాలగ్రా మ హారం, 4.65 కిలోల బంగారంతో ఐదు పేటల కంఠ ఆభరణాన్ని చేయించారు. తిరుపతిలో అమ్మవారికి బంగారు ముక్కుపు డకను కానుకగా సమర్పించనున్నారు.
 
కేసీఆర్ పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఏపీ డీజీపీకి, టీటీడీ అధికారులకు తెలంగాణ ఇంటెలిజెన్స్‌ ఐజీ ఇప్పటికే సమాచారం అందించినట్లు సమాచారం. సీఎం బుధవారం ఉదయమే తిరుమలలో శ్రీవారిని, తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకుంటారు. తిరుమల పుష్పగిరి మఠంలో సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి వివాహానికి ముఖ్య మంత్రి హాజరవుతారు.