క్రైస్తవులకు కేసీఆర్ స్పెషల్ గిఫ్ట్..! రూ. 10 కోట్లతో కొత్త భవనం...!
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ క్రైస్తవులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. తెలంగాణలో ఈ యేడాది డిసెంబర్ 25వ తేది క్రిస్మస్ పండుగకు రెండు రోజులు, జనవరి 1వ తేది ఆంగ్ల నూతన సంవత్సరాదికి అంటూ మూడు రోజుల సెలవును కేసీఆర్ ప్రకటించారు.
36వ యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గన్న ముఖ్యమంత్రి క్రిస్టయన్లపై వరాల వర్షం కురిపించారు. సెలవులతో పాటు..క్రిస్టియన్ల కోసం రూ.10కోట్లు ఖర్చు పెట్టి ఒక భారీ క్రైస్తవ భవనం నిర్మిస్తామని చెప్పిన ఆయన.. ఆ మాటకు డెడ్‌లైన్ కూడా తానే చెప్పేశారు. వచ్చే క్రిస్మస్ నాటికి ఆ భవాన్ని సిద్ధం చేస్తామని.. వచ్చేఏడాది క్రిస్మస్ వేడుకలు అందులో నిర్వహిద్దామని చెప్పేశారు.
మా ప్రభుత్వం దళితులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నదో అవే పథకాలు దళిత క్రైస్తవులకూ అందుతాయని, వారి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని హామీ ఇచ్చారు.
నగరంలో క్రైస్తవులకు ప్రత్యేక సమాధుల కోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్థలాలను కేటాయిస్తామని, దానికి ఈ నెలాఖరులో శంకుస్థాపన చేస్తామన్నారు. చర్చిల నిర్మాణ ప్రక్రియను సులభతరం చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని, అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ అనుమతిపైనా శుక్రవారం జీవోని తీసుకొస్తామని కేసీఆర్ తెలిపారు.