మంగళవారం, 8 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By CVR
Last Updated : ఆదివారం, 8 ఫిబ్రవరి 2015 (17:09 IST)

విధులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : కవిత హెచ్చరిక

హైదరాబాద్‌లోని అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని, విధులను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆమె ఆదివారం రోజు మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్‌కు తప్ప మరే పార్టీకి మనుగడ లేదన్నారు.
 
కేసీఆర్ అధికారం చేపట్టి ఎనిమిది నెలలే అవుతున్నా ఆయన 200 పథకాలను ప్రకటించారని తెలిపారు. దీన్నిబట్టే ఆయనకు ప్రజలపై ఉన్న శ్రద్ధ అర్ధమవుతుందని కవిత పేర్కొన్నారు. కేసీఆర్ ప్రకటించే ప్రతి పథకాన్ని ప్రజలకు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం టీఆర్ఎస్ చేసేంత కృషి మరే పార్టీ చేయబోదని కవిత తెలిపారు.