ఆదివారం, 20 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By CVR
Last Updated : శుక్రవారం, 5 డిశెంబరు 2014 (11:15 IST)

అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడితే సహించం...కేసీఆర్‌కు రేవంత్ హెచ్చరిక

రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో దోపిడీలకు పాల్పడితో సహించేబోమని కేసీఆర్‌ని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. నగరంలోని భూ ఆక్రమణలపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. భూ ఆక్రమణదారులు పేదవాళ్లయితే వారికి పట్టాలు ఇవ్వాలని సూచించారు. కబ్జాదారులపై పీడీ చట్టం పెట్టేందుకూ వెనుకాడవద్దని తెలిపారు. కబ్జా చేసింది ఎంతటి వారైనా టీఆర్‌ఎస్ నేతలైనా వదలిపెట్టొద్దన్నారు. 
 
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడితే టీడీపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తానని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అభివృద్ధి పేరుతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ప్రభుత్వ భూములన్నీ కంపెనీలకు కట్టబెట్టి లబ్ధిపొందారని, అదే విధంగా కేసీఆర్ కూడా భూములను దోచుకునే ప్రయత్నం చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కనబెట్టి కొత్తకొత్త పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.