సోమవారం, 21 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By CVR
Last Updated : గురువారం, 4 డిశెంబరు 2014 (11:32 IST)

జోరుగా వాటర్‌గ్రిడ్‌ పథకం పనులు... ప్రభుత్వం ఆదేశం

వాటర్‌గ్రిడ్‌ పథకం పనులను జోరుగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వచ్చే నాలుగేళ్లలో వాటర్‌ గ్రిడ్‌లను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకుగాను వాటర్‌ గ్రిడ్‌లకు కావాల్సిన నీటి లభ్యత, గ్రిడ్‌ల నిర్మాణానికి అనువైన స్థలాల ఎంపిక ఇంకా పలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సుధీర్ఘంగా చర్చలు జరిపారు.

వాటర్‌గ్రిడ్‌ పనులను ప్రణాళికాబద్ధంగా చేయాలని ఈ సందర్బంగా ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాకండా వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుకు కావాల్సిన నీటి వనరులను ఆయా జిల్లాల మ్యాప్‌లను గూగుల్‌ సహాయంతో గుర్తించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. నీటి వనరులు, గుట్టలు, ఎత్తైన ప్రాంతాలున్న మ్యాప్‌లను పరిశీలించి మండలాల వారీగా కాంటూర్లను గుర్తించారు. 
 
ఇక ఈ పథకంలో అతి ముఖ్యమైనది పైపులైన్లు. పథకానికి అవసరమయ్యే పైపులను ఇక్కడే తయారుచేయాలని ఇదివరకే సూచించినట్లు ముఖ్య మంత్రి గుర్తు చేశారు. వాటి నిర్మాణాలపై అధికారులు ఎప్పటికప్పుడు వేగంగా స్పందించాలని సూచించారు.