బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (22:45 IST)

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

kasthuri
kasthuri
తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు కారణంగా మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. రోజు రోజుకీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయే యువకులు పెరుగుతున్నారు. హైదరాబాదులో ఆలయ ప్రదక్షణలు చేస్తుండగా ఒక యువకుడు, పెళ్లి బారాత్‌లో డ్యాన్స్ చేస్తూ మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గుండెపోటు కారణంగా 12 ఏళ్ల బాలిక మరణించింది. ఈ ఘటన చెన్నూరు పట్టణంలోని పద్మానగర్‌ కాలనీలో చోటుచేసుకుంది.
 
పద్మానగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్, రమ్య దంపతుల కుమార్తె కస్తూరి నివృత్తి ఆడుకుంటుండగా కుప్పకూలిపోయిందని స్థానికులు తెలిపారు. వెంటనే ఆమెను పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించడంతో ఆమె తల్లిదండ్రులను కలిచివేసింది. 
 
ఆమె పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. పవిత్రమైన కార్తీక మాసం పౌర్ణమిని రోజున పాఠశాల సెలవు కావడంతో ఇంట్లో ఆడుకుంటూ కనిపించిన బాలిక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ ఇంట విషాదాన్ని నింపింది.