మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 13 ఆగస్టు 2024 (22:55 IST)

చేనేతకు వైభవం, సంప్రదాయంతో సమకాలీన సమ్మేళనం, తనైరా లైవ్ లూమ్ అనుభవపూర్వక కార్యక్రమం

Handlooms
సంప్రదాయ ఎత్నిక్ వస్త్రాలలో ప్రత్యేకత కలిగిన టాటా ఉత్పత్తి, తనైరా. భారతీయ చేనేత వైభవాన్ని దశదిశలా చాటి, మారుతున్న అభిరుచులు పెరిగిన సాంకేతికతో పోటీ పడలేక అంతరించిపోయే దశకు చేరిన ఎన్నో చేనేత కళారూపాలకు పునర్జీవనం పోస్తుంది. అలనాటి చేనేత వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేయటంతో పాటుగా ప్రాంతీయ, అరుదైన పనితనంతో అద్భుతాలు సృష్టించటంలోని కష్టతరమైన ప్రక్రియను ప్రదర్శించే అనుభవపూర్వక  కార్యక్రమం లైవ్ లూమ్‌ను ఇప్పుడు చేపట్టింది. 
 
తమ కార్యకలాపాలను 2017లో ప్రారంభించిన తనైరా, భారతదేశం అంతటా మహిళలను ఆకర్షిస్తూ రూ. 50,000 కోట్ల ఎత్నిక్ వేర్ మార్కెట్‌లో గుర్తించదగిన వాటాను సొంతం చేసుకుంది. స్థానిక కళాకారుల సహకారంతో సంప్రదాయ నేత పద్ధతులను పునరుద్ధరించడానికి ఈ బ్రాండ్ కట్టుబడి ఉంది, తద్వారా చేనేత చీరల వారసత్వాన్ని కాపాడుతుంది. దీని క్యూరేటెడ్ ఎంపికలో బాలుచారి, రంగకత్, వైరౌసి, పటాన్ పటోలా, డోలీ బరాత్ వంటి విభిన్న శ్రేణి భారతీయ చేనేతలు ఉన్నాయి.
 
ఆవిష్కరణలే బలం... అదే చేనేత వృద్ధికి మార్గం  
ఆవిష్కరణలతోనే చేనేత వృద్ధి సాధ్యమని తనైరా బలంగా నమ్ముతుంది. ఆలోచనాత్మకమైన డిజైన్‌లను పరిచయం చేయడం ద్వారా తమ కస్టమర్‌ల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి తనైరా నిరంతరం కృషి చేస్తుంది. అందుకే అన్ని రకాల శరీర తత్త్వాలు కలిగిన వారికి అనుగుణంగా చీరలను రూపొందించటానికి వీవర్‌షాలాలు వీలు కల్పించాయి. 
 
సాంప్రదాయ చేనేత పద్ధతులను సంరక్షించడం, ఆధునీకరించడం అనే లక్ష్యంతో తనైరా 2022లో 'వీవర్‌షాలా' కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారణాసి, చంపా, కోయంబత్తూర్, బారుయ్‌పూర్, ఫులియా, మంగళగిరి వంటి నగరాల్లో దాదాపు వందమంది కళాకారులతో 20 వీవర్‌షాలాల ద్వారా  బహుళ-తరాలకు చెందిన కళాకారులతో కలిసి పనిచేస్తూనే ఉంది.
 
లైవ్ లూమ్స్ యొక్క ఉద్దేశ్యం
చేనేత, నేత పద్ధతుల యొక్క గొప్ప సంప్రదాయంతో కస్టమర్‌లను మళ్లీ కనెక్ట్ చేయడానికి, తనైరా తమ స్టోర్‌లలో లైవ్ లూమ్‌లని  కలిగి ఉంది. ఇక్కడ, నైపుణ్యం కలిగిన నేత కార్మికులు తమ పనితనం యొక్క కళాత్మకతను ప్రదర్శిస్తారు. ఉప్పాడ, మంగళగిరి, కలంకారి, ఇకత్‌లతో సహా గద్వాల్, నారాయణపేట, బనారస్, చందేరి, మహేశ్వర్, ఇకత్ వంటి ఇతర ప్రత్యేకమైన క్రాఫ్ట్‌లకు ప్రసిద్ధి చెందిన తనైరా ఈ కళాత్మక వైభవాన్ని మరింత అందంగా ప్రదర్శిస్తుంది. 
 
కనుమరుగవుతున్న క్రాఫ్ట్‌లను కాపాడుతోంది 
ప్రసిద్ధ చేనేత సంప్రదాయాలతో పాటుగా, డోలీ బరాత్ వంటి అంతగా తెలియని సున్నితమైన వస్త్ర సంప్రదాయాలను, అలాగే బనారస్‌ నేతలో 4-5 రంగులను ఉపయోగించే ఒక క్లిష్టమైన టెక్నిక్. రంగకత్ క్రాఫ్ట్‌లను కాపాడుతోంది. చేనేత కళాకారుల జీవితాలను స్పృశించడం, అల్లికలను పెంపొందించడం ద్వారా తనైరా భారతదేశ చేనేత వారసత్వాన్ని పొందికగా సంరక్షించేందుకు కట్టుబడి వుంది.