ఆదివారం, 13 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (17:11 IST)

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

alekhya chitti
నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారం చేస్తూ మంచి ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి, ఆమె ఇద్దరు చెల్లెళ్లు ఇపుడు నెటిజన్లకు హాట్ టాపిక్‌‍గా మారారు. పచ్చళ్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నందుకు కస్టమర్‌ను రాయడానికి వీల్లేని భాషలో బండబూతులు తిట్టారు. దీంతో వళ్లుమండిన ఆ కస్టమర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది పెద్ద వివాదానికి దారితీసింది. పైగా, నెట్టింట బాయ్‌కాట్ అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ నెటిజన్లు ఓ హ్యాష్‌‍ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. 
 
ఫలితంగా చిట్టి పచ్చళ్ళ వ్యాపారంతో పాటు వారు నడుపుతూ వచ్చిన వెబ్‌సైట్ క్లోజ్ అయింది. అలేఖ్య చిట్టి అనారోగ్యంపాలుకావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం సాగుతోంది. దీంతో దిగివచ్చిన అలేఖ్య చిట్టి సోదరీమణులు... తమపై ఇకనైనా ట్రోలింగ్ ఆపాలని, తాము ఇకపై పచ్చళ్ల వ్యాపారం చేయబోమని, తమను వదిలివేయాలంటూ ప్రాదేయపడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.