హైదరాబాద్ రెస్టారెంట్‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)
హుబర్ అండ్ హోలీ అనే హైదరాబాదు రెస్టారెంట్లో బంగారు పూత పూసిన ఐస్ క్రీం వడ్డిస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ వంటకం ధర రూ.1,200. నెటిజన్లు దీనిని "అంబానీ ఐస్ క్రీం" అని పిలిచారు. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన ఫుడ్ వ్లాగర్ ఇది భారతదేశంలో "అత్యంత ఖరీదైన ఐస్ క్రీం" అని రాశాడు.
ఈ ఐస్ క్రీమును ఒక సిబ్బంది తన చేతుల్లో ఐస్ క్రీం కోన్ పట్టుకుని, దానిలో చాక్లెట్ ముక్కలు, లిక్విడ్ చాక్లెట్, బాదం పప్పులు, చాక్లెట్ ఐస్ క్రీం స్కూప్స్ నింపుతుండగా వీడియో ప్రారంభమైంది. ఆ తర్వాత అతను దానిపై మందపాటి క్రీమ్ పొరను పూసి, డెజర్ట్‌కు అద్భుతమైన రూపాన్ని ఇచ్చాడు.
క్రీమీ లేయర్ సెట్ చేసిన తర్వాత, సిబ్బంది ఐస్ క్రీంను బంగారు రేకుతో అలంకరించారు. ఈ డెజర్ట్‌ను సాధారణ ప్లేట్‌లో కాకుండా బంగారు రంగు ట్రేలో వడ్డించారు. దీంతో ఆ ఐస్‌క్రీముకు రాయల్ లుక్ వచ్చేసింది. మార్చి 6న అప్‌లోడ్ చేయబడిన ఈ పోస్ట్ 10 మిలియన్ల వీక్షణలు, మూడు లక్షల లైక్‌లు, వందలాది కామెంట్లు నమోదైనాయి.