సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (17:01 IST)

హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్.. ఆదివారం నో నాన్ వెజ్

అవును.. హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్. అదేంటంటే.. వచ్చే ఆదివారం (ఏప్రిల్ 21) హైదరాబాదీ మాంసం దొరకదు. ఎందుకంటే మహావీర్ జయంతి సందర్భంగా నగరంలోని కబేళాలతో పాటు అన్ని మాంసం దుకాణాలను ఆదివారం మూసివేయాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో భాగ్యనగర పరిధిలోని మాంసం దుకాణాలు ఆదివారం మూతపడనున్నాయి. 
 
కాగా జైనులకు మహావీర్ జయంతి అత్యంత ముఖ్యమైన పండుగనే విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలో జైనుల సంఖ్య గణనీయంగా ఉండడంతో జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఇకపోతే.. హైదరాబాద్ నగరంలో మాంసం విక్రయాలు గణనీయ సంఖ్యలో ఉంటాయి. ఆదివారం అంటే ఆ సంఖ్య మరింత ఎక్కువగా వుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం మాంసం ముక్క లేకుండా.. హైదరాబాదీ వాసులు తినాల్సి వుంటుంది.