బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (20:30 IST)

గంగవ్వపై కేసు నమోదు.. రూ.25 వేల అపరాధం

Gangavva
మై విలేజ్ షో ద్వారా గుర్తింపు పొంది ప్రస్తుతం బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌‍లో ఓ కంటెస్టెంట్‌గా ఉన్న గంగవ్వ ఇపుడు చిక్కుల్లో పడింది. ఆమెపై తెలంగాణ అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు రూ.25 వేల అపరాధం కూడా విధించారు. ఈ మొత్తాన్ని యూట్యూబర్ రాజు చెల్లించారు. 
 
గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై అటవీశాఖ అధికారులు వైల్డ్ లైఫ్ కింద జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు కేసు నమోదు చేశారు. 2022 సంవత్సరం మే నెలలో తీసిన ఓ వీడియోలో చిలుకను ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు. 
 
జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త గౌతమ్ ఈ ఘటన‌పై ఫిర్యాదు చేసినట్లుగా ఎఫ్ఆర్‌వో తెలిపారు. యూట్యూబ్ ‌ప్రయోజనాల కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు.