ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (13:39 IST)

హైదరాబాదులో గంజాయి చాక్లెట్లు.. ముఠా అరెస్ట్.. లేడీ డాన్ కూడా?

Ganja Chocolates
Ganja Chocolates
హైదరాబాద్ పరిధిలోని రామచంద్రాపురంలో గంజాయి చాక్లెట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైంది. వివరాల్లోకి వెళితే.. ముగ్గురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నారనే సమాచారం ఎస్‌వోటీ పోలీసులకు తెలిసింది. నిందితుల నుంచి 250 ప్యాకెట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
మరోవైపు నానక్‌రామ్ గూడలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లకు గంజాయి అమ్ముతున్న లేడీ డాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతిరోజు 20 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని ఈ లేడీ డాన్ అమ్ముతోంది. దీంతో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు ఆమె వద్ద భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.