సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2024 (10:40 IST)

గచ్చిబౌలిలో నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్- విగ్గులతో 50 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. (video)

Vamsi Krishna
Vamsi Krishna
గచ్చిబౌలిలో నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్ అయ్యాడు. విగ్గులు పెట్టుకుంటూ  50 పెళ్లిళ్లు చేసుకున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన వంశీకృష్ణకు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈజీ మనీకి అలవాటు పడిన వంశీకృష్ణ మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా మోసాలు చేయటం ప్రారంభించాడు. తనను తాను డబ్బున్నోడిగా మ్యాట్రిమొనీ సైట్లలో పరిచయం చేసుకుంటాడు. 
 
బట్టతల ఉండటంతో దాన్ని కవర్ చేసేందుకు విగ్గులు పెట్టుకుని, స్టైలిష్‌గా లుక్ మార్చుతూ అందులో ఫొటోలు అప్లోడ్ చేసేవాడు. దీంతో అతడి ప్రొఫైల్ నిజమని నమ్మిన పలువురు అమ్మాయిలను పెళ్లి చేసుకుని, లక్షల కట్నం దండుకుని కొన్నాళ్లకు ముఖం చాటేస్తాడు. 
 
మరో గెటప్‌తో మళ్లీ లేటెస్ట్ ప్రొఫైల్ అప్‌లోడ్ చేస్తాడు. ఇలా దాదాపుగా 50 మంది అమ్మాయిలను వంశీకృష్ణ పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు తెలిసింది. 
 
నగరానికి చెందిన ఓ లేడీ డాక్టర్ను కూడా ఇలానే పెళ్లి చేసుకుని మోసం చేశాడు. అతడి మోసాన్ని పసిగట్టిన డాక్టర్.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వంశీకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనూ ఈ నిత్యపెళ్లికొడుకు పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిసింది.