సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (13:59 IST)

హీరో నాగార్జున పరువు నష్టందావా.. మంత్రి కొండా సురేఖ రిప్లై

konda surekha
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావాపై హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. ఈ కేసులో మంత్రి కొండా సురేఖ తరపున న్యాయవాది గుర్మీత్‌ సింగ్‌ బదులి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు.. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 30 తేదీకి వాయిదా వేసింది. 
 
ఇటీవల సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ట దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.