గురువారం, 2 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 సెప్టెంబరు 2025 (14:28 IST)

Hyderabad rains: టీజీఎస్సార్టీసీ ఎంజీబీఎస్ బ‌స్ స్టేష‌న్ నుంచి బ‌స్సుల రాకపోకల్లో మార్పులు (video)

MGBS
MGBS
హైదరాబాద్ మహా నగరం వరదలతో మునిగిపోయింది. పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురవడంతో ప్రధాన రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి. ముఖ్యంగా హిమాయత్ సాగర్ జలాశయం వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి నీరు అధికంగా వచ్చి చేయడంతో జలాశయం పూర్తి స్థాయికి చేరింది. ఫలితంగా అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 
 
భారీ వరదనీరు రోడ్లపైకి రావడంతో రోడ్లు మూసివేత కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను గచ్చిబౌలి, ఇతర సమీప మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచిస్తున్నారు. 
 
ఇంకా మూసీ న‌దికి భారీ వ‌ర‌ద నేప‌థ్యంలో ఎంజీబీఎస్ ప్రాంగణంలో వరద నీరు చేరడంతో టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా బస్సులను నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బ‌య‌లుదేరే బ‌స్సుల‌ను హైద‌రాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ న‌డుపుతోంది. ఈ మేరకు వరంగల్, హన్మకొండ వైపున‌కు వెళ్లేవి ఉప్ప‌ల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి. 
 
అలాగే సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ, విజ‌య‌వాడ వైపున‌కు బ‌స్సులు ఎల్బీన‌గ‌ర్ నుంచి న‌డుస్తున్నాయి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, క‌ర్నూల్, బెంగ‌ళూరు వైపున‌కు వెళ్లే స‌ర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయని టీజీఎస్సార్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. వివ‌రాల‌కు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-69440000, 040-23450033 సంప్ర‌దించాల‌ని సూచించింది.