మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (21:10 IST)

హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి.. మీర్ ఆలం చెరువు మీదుగా..?

charminar
హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి రాబోతోంది. చింతల్ మెట్ రోడ్డును బెంగళూరు జాతీయ రహదారితో కలుపుతూ మీర్ ఆలం చెరువు మీదుగా హైదరాబాద్‌కు రెండో తీగల వంతెన త్వరలో రాబోతోంది. రూ.363 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లైన్ల హైలెవల్ వంతెన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 
 
మీర్ ఆలం చెరువుపై నాలుగు లైన్ల కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు తెలంగాణ సీఎంఓకు ధన్యవాదాలు అని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని అంటూ తెలిపారు. 
 
మీర్ ఆలం ట్యాంకు చుట్టూ పనులు చేస్తే జీవనోపాధి మెరుగుపడుతుంది. ఈ కేబుల్ వంతెన ప్రయాణీకులకు కూడా సహాయపడుతుందనడంలో సందేహం లేదు.. అంటూ చెప్పుకొచ్చారు.