బెయిల్‌పై విడుదలైన జానీ మాస్టర్.. ఎర్ర కండువాతో కనిపించారంటే? (video)
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్‌పై విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంచల్ గూడ జైలు నుంచి నీ మాస్టర్ బయటకు వచ్చారు. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆయన శుక్రవారం చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయ్యారు. అయితే జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన మెడలో ఎర్రగా కండువా ఉండటం విశేషం.
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో ఎన్నికలకు ముందు జానీ మాస్టర్ కీలక బాధ్యతలు నిర్వహించాడు. అయితే జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.. వెంటనే ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయిన్నప్పటికీ ఇప్పుడు జానీ ఎర్రగా కండువాతో కనిపించడం ఆసక్తికరంగా మారింది. జైలు నుంచి వస్తూనే జానీ మాస్టర్ ఎర్ర కండువాతో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారనే చర్చ జరుగుతోంది
లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి జీరో ఎఫ్‌ఐఆర్ కాగా, అదే రోజున నార్సింగ్ పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.