శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 9 డిశెంబరు 2023 (14:25 IST)

కారు నెంబరు ప్లేట్ పైన మోదీ అని రాసుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర బీజెపి అధ్యక్షుడు కాబోతున్నారా?

Kamareddy MLA Katipalli
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో అప్పటి సిఎం కేసీఆర్‌ను, ప్రస్తుత సీఎం అయిన రేవంత్ రెడ్డిని ఓడించిన ఘనత ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిది. ఈయన పేరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
 
ఇదిలావుంటే ఆయన తన కారు నెంబరును 4749ను ఎంపిక చేసుకున్నారు. ఐతే ఏంటటా అనుకునేరు, అక్కడే వుంది అసలు సంగతి. ఆ నెంబరును మోదీ అని హిందీ అక్షరాలు వచ్చేట్లు డిజైన్ చేయించుకుని తిరుగుతున్నారు. దీనితో ఆయన మరింత చర్చనీయాంశంగా మారారు. అంతేకాదు... మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అనుకున్నస్థాయిలో సీట్లను సాధించలేకపోయిందనే టాక్ వుంది.