పుట్టిండో పులి పిల్ల పాలమూరు జిల్లాలోన... సీఎం రేవంత్‌ప కిన్నెర మొగులయ్య పాట...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కిన్నెర వాయిద్యకారుడు, "భీమ్లా నాయక్" గాయకుడు, పద్మశ్రీ కిన్నెర మొగలయ్య కలుసుకున్నారు. సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు. మొగులయ్యను ఆయన చిన్న కుమారుడిని మంత్రి కొండా సురేఖ సీఎం నివాసానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ ముందు మొగులయ్య తన కళను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్‌పై ఓ పాటను కూడా పాడారు. "పుట్టిండో పులి పిల్ల పాలమూరు జిల్లాలోన అచ్చంపేట తాలూకాలోన కొండారెడ్డిపల్లిలోన" అంటూ ఓ పాట పాడారు. మొగులయ్య పాటకు మంత్రముగ్ధుడైన సీఎం రేవంత్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
ఆ తర్వా మొగులయ్య వ్యక్తిగత జీవిత అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. నాగర్ కర్నూ్ జిల్లా లింగాల మండలం పరిధిలోని అవుసలి కుంట గ్రామానికి చెందిన మొగులయ్య కిన్నెర వాయిద్యకళాకారుడు. ప్రస్తుతం 12 మెట్ల కిన్నర వాయిద్యాన్ని మాత్రమే వాయించగలరు. కిన్నెర వాయిద్యానికి విశేష గుర్తింపు తీసుకొచ్చినందుకు మొగులయ్యను గత 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కూడా ఆయనను ఘనంగా సత్కరించి ఆర్థిక సాయం కూడా చేసిన విషయం తెల్సిందే.