బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (14:51 IST)

లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపిన ఎక్సైజ్ పోలీసులు! (Video)

Whiskey Ice Cream
తెలంగాణా రాష్ట్రంలో అబ్కారీ శాఖ పోలీసులు అరాచకానికి పాల్పడ్డారు. లంచం ఇవ్వలేదన్న అక్కసుతో ఓ ఐస్ క్రీమ్ షాపులో తయారు చేసే ఐస్ క్రీమ్‌లలో విస్కీ కలిపి కేసు బుక్ చేశారు. దీంతో విస్కీ ఐస్ క్రీమ్‌ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. దీనికి సంబందించిన వీడియో ఒకటి వెలుగులోకి రావడంతో ఎక్సైజ్ పోలీసుల అరాచకాలు బయటపడ్డాయి. 
 
హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులకు లంచం ఇవ్వని అరికో కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి. ఓనర్‌ను ఇరికించాలని చూసిన ఎక్సైజ్ పోలీసులు. డెకాయ్‌ ద్వారా పదకొండున్నర కిలోల కేక్ ఆర్డర్ చేయించిన ఎక్సైజ్ పోలీసులు. ఆన్‌లైన్ ద్వారా నగదు పంపించి.. విస్కీ బాటిల్ కొని కేక్‌లో కలపాలని చెఫ్ దయాకర్‌కు చెప్పిన అధికారులు.. కుదరదన్న దయాకర్. 
 
దీంతో వాచ్‌మన్ తాగి పడేసిన మందు బాటిళ్లు లోనికి తీసుకొచ్చి.. రైడ్ చేసినట్టు డ్రామాలు ఆడిన అధికారులు. ఉన్నతాధికారులకు, మానవహక్కుల కమిషన్‌ ఫిర్యాదు చేసిన అరికో కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి. ఈ విస్కీ ఐస్ క్రీమ్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.