బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 జులై 2024 (08:34 IST)

తోకతో జన్మించిన బాలుడు... శస్త్ర చికిత్సతో తొలగించిన వైద్యులు

human tail
గత యేడాది హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళకు తోకతో ఉన్న బాలుడు జన్మించాడు. ఈ బాలుడి పుట్టుక ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మూడు నెలలు పూర్తయ్యేసరకి ఆ తోక కాస్త 15 సెంటీమీటర్ల మేరకు పెరిగింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఈ ఏడాది జనవరిలో బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగం అధిపతి, అదనపు ప్రొఫెసర్‌ డాక్టర్‌ శశాంక్‌ పాండా పరీక్షించి వెన్నెముకలోని ఐదు వెన్నుపూసలతో అనుసంధానమై తోక బయటకు వచ్చినట్లు గుర్తించారు. 
 
ఆ వెంటనే తన వైద్యబృందంతో కలిసి శస్త్రచికిత్స చేసి దానిని విజయవంతంగా తొలగించారు. తోక నాడీ వ్యవస్థతో ముడిపడి ఉన్నందున శస్త్రచికిత్స అత్యంత క్లిష్టమైందని పేర్కొన్నారు. అయితే ఈ తరహా శస్త్రచికిత్సల అనంతరం నాడీ సంబంధిత సమస్యలు ఎదురవుతాయన్నారు. అయితే ఈ బిడ్డను తాజాగా పరీక్షించగా ఏ విధమైన ఇబ్బంది ఉత్పన్నం కాలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని డాక్టర్ శశాంక్ పాండా వెల్లడించారు.