బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (11:09 IST)

ఇంటి తాళాలను పగులగొట్టి రూ.2 కోట్ల నగదు దోపిడీ..

Cash
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. మక్త గ్రామంలోని నాగభూషణం అనే వ్యక్తి ఇంట్లో రూ.2 కోట్ల నగదును దుండగులు చోరీచేశారు. ఇంటి తాళాలలను పగులగొట్టి బీరువాలో ఉంచిన నోట్ల కట్టలను ఎత్తుకెళ్లారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి విచారణ చేపట్టారు.
 
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన ప్రకారం.. నాగభూషణం ఇటీవల శంకర్‌పల్లిలో 10 ఎకరాల భూమి విక్రయానికి ఒప్పందం చేసుకున్నారు. కొనుగోలుదారులు అడ్వాన్స్‌గా రూ.2 కోట్ల 2 లక్షల నగదు ఇవ్వడంతో ఇంట్లో ఉంచారు. ఆ నగదుతో పాటు 28 తులాల బంగారు నగలును దొంగలు ఎత్తుకెళ్లారు. నాగభూషణం వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.