సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 జులై 2024 (19:46 IST)

వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారికి అగ్గిపెట్టెకు సరిపడే చీర

Vemulavada Temple
వేములవాడ ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామితో పాటు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సిరిసిల్లకి చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్‌కుమార్‌ అగ్గిపెట్టెకు సరిపడే చీర, శాలువను మంగళవారం బహూకరించారు.
 
చీరతో పాటు అగ్గిపెట్టెలో పట్టే శాలువాను కూడా పీఠాధిపతులకు బహూకరించారు. ఇంతకుముందు విభిన్నమైన వస్తువులతో చీర నేయడంలో దిట్ట అయిన వచ్చిన విజయ్ కుమార్, చేనేత చీర, శాలువాను తయారు చేశారు.
 
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శివుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నల్ల విజయ్‌కుమార్‌‌ను పూజారులు, కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.