గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (14:23 IST)

సీఎంఆర్ఎఫ్ చెక్కుల దుర్వినియోగం కేసు : హరీశ్ రావు మాజీ పీఏ అరెస్టు

arrest
సీఎంఆర్ఎఫ్ చెక్కుల దుర్వినియోగం కేసులో భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పీఏను పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా వాసి ఫిర్యాదుతో కేసు నమోదుచేశారు. ఈ కేసులో ఆయనతో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల దుర్వినియోగం కేసులో హరీశ్ రావు పీఏ నరేశ్ కుమార్‌ను అరెస్టు చేసిన విషయాన్ని పోలీసులు సైతం నిర్ధారించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగం అయ్యాని, అనర్హులకు చెక్కులు అందించారని మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన రవినాయక్ ఫిర్యాదు చేశారు. 
 
తనకు మంజూరైన రూ.5 లక్షలు చెక్కును నరేశ్ కుమార్ కాజేశాడని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో నరేశ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. 
 
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి హరీశ్ రావు ఆఫీసులో నరేశ్ కుమార్, మరో ముగ్గురు ఆఫీసు సిబ్బంది సీఎంఆర్ఎఫ్ విభాగంలో పని చేశారు. ఈ క్రమంలోనే చెక్కులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రాథమికంగా ఆధారాలు లభించినట్టు సమాచారం. రవినాయక్‌కు చెందిన రూ.5 లక్షల చెక్కును క్యాష్ చేసుకుని నరేశ్, వంశీ, వెంకటేశ్‌, ఓంకార్‌లు పంచుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వారి దగ్గరు మరికొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు దొరికినట్టు సమాచారం.