బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 మే 2024 (13:34 IST)

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

Rakesh-mallareddy and others
మాజీ మంత్రి మల్లా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లోని తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్‌ వేశారని మల్లారెడ్డి పోలీసులకు చెప్పారు. 
 
ఆ స్థలంలో వేసిన ఫెన్సింగ్‌ను కూల్చాలంటూ అనుచరులకు చెప్పారు మల్లారెడ్డి. వివాదంలోని భూమిలో ఘర్షణకు దిగొద్దని ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. దీనిపై పోలీసులతో పెద్దగా వాగ్వాదానికి దిగారు మల్లా రెడ్డి. 
 
కేసు పెడితే పెట్టుకోండి.. తన స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మల్లా రెడ్డి అనుచరులు ఫెన్సింగ్‎ను కూల్చి వేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పరిస్థితి సర్ధుమణిగేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి‎ని బషీర బాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.