గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (21:54 IST)

Telangana Prajapalana Vijayotsavam: జాగిలాల ప్రదర్శన అదుర్స్ (వీడియో)

Dog
Dog
Telangana Prajapalana Vijayotsavam: ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా తెలంగాణ పోలీసుల ధైర్య సాహసాలు కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వేదికగా ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు జరిగాయి. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. హోంశాఖ నిర్వహించిన విజయోత్సవాలలో తెలంగాణ పోలీసుల ధైర్య సాహసాలను చాటిచెప్పేలా పలు ప్రదర్శనలు సైతం సాగాయి. ఈ సందర్భంగా పోలీస్ జాగిలాల ప్రదర్శన ప్రజా ప్రతినిధులు, అధికారులను ఆకట్టుకుంది.
 
ఈ వేడుకల్లో భాగంగా.. గోల్డ్ మెడలిస్ట్ జాగిలాలు మాయ, రాకీ, శ్యాం తమ సత్తాను చాటాయి. ఈ సంధర్భంగా పలు స్టాల్స్ లను ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, అధికారులు వాటిని పరిశీలించారు.
 
అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. మహనీయులు అంబేద్కర్ స్పూర్తితో తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వేచ్చను ఇచ్చిందన్నారు. ఇప్పటికే తాము ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టామని, అదే రీతిలో ఏడో గ్యారంటీగా స్వేచ్చను అందించమని సీఎం అన్నారు. 
 
హైదరాబాద్ అంటేనే డ్రగ్స్ విక్రయాలు నిర్వహించేందుకు భయపడే రీతిలో పోలీసులు విధులు నిర్వర్తించాలని సీఎం సూచించారు. తెలంగాణ హోం గార్డ్స్ కి జీతాలు పెంచినట్లు సీఎం శుభవార్త చెప్పారు. పోలీస్ కుటుంబాల పిల్లల చదువుల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.