ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (20:26 IST)

బీఆర్ఎస్ నేతలను చూస్తే జాలేస్తుంది : మంత్రి శ్రీధర్ బాబు

sridhar babu
పదేళ్లపాటు అధికారంలో ఉండి, ఇపుడు అధికారానికి దూరమైన భారత రాష్ట్ర సమితి (భారస) నేతలను చూస్తే జాలేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కాకుండానే కాంగ్రెస్‌పై బురద జల్లడం సరికాదన్నారు. 
 
ఇపుడు బీఆర్ఎస్ నేతలను చూస్తే జాలేస్తుందన్నారు. ప్రజలు సుపరిపాలన కోరుకున్నారనీ, అందుకే మార్పు కోరుతూ తీర్పు ఇచ్చారన గుర్తు చేశారు. డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమలు చేశామన్నారు 
 
రాష్ట్రంలో ఆరున్నర కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. ఈ ఉచిత ప్రయాణ పథకానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని, అందువల్ల ఎవరు 420 ప్రజలకు బాగా తెలుసని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాగా, విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు.