ఆదివారం, 19 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (18:04 IST)

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ-20: హైదరాబాదులో ట్రాఫిక్ మళ్లింపు

cricket stadium
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ దృష్ట్యా, రాచకొండ పోలీసులు శనివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11.50 గంటల మధ్య కొన్ని ట్రాఫిక్ మళ్లింపులకు నోటీసు ఇచ్చారు.
 
వరంగల్ హైవే నుంచి చెంగిచెర్ల వైపు వెళ్లే లారీ, డంపర్, ఎర్త్‌మూవర్, ఆర్‌ఎంసీ ట్రక్కులు, వాటర్ ట్యాంకర్ వంటి భారీ వాహనాలను చెంగిచెర్ల ఎక్స్ రోడ్డు-చెర్లపల్లి-ఐఓసీఎల్-ఎన్‌ఎఫ్‌సీ రోడ్డు వైపు మళ్లిస్తారు. 
 
అదేవిధంగా ఎల్‌బీనగర్‌ నుంచి నాగోల్‌ వైపు వెళ్లే ఈ వాహనాలను నాగోల్‌ మెట్రోస్టేషన్‌ వైపు హెచ్‌ఎండీఏ-బోడుప్పల్‌-చెంగిచెర్ల ఎక్స్‌ రోడ్డు మీదుగా, మల్లాపూర్‌ నుంచి నాచారం ఐడీఏ వైపు వెళ్లే భారీ వాహనాలను హబ్సిగూడ మీదుగా చెర్లపల్లి-చెంగిచెర్ల మీదుగా మళ్లిస్తారు. ప్రజలు సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరారు.