ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మంది ట్రాన్స్‌జెండర్లు
Transgenders recruited as traffic police assistants: హైదరాబాద్ నగర పోలీసు విభాగంలో బుధవారం 44 మంది ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమితులయ్యారు. తమ సమాజానికి ఆదర్శంగా ఉండాలని, హైదరాబాద్ పోలీసులకు, తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో గుర్తింపు తెచ్చేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లను నియమిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను అనుసరించి 29 మంది ట్రాన్స్‌జెండర్లు, 15 మంది లింగమార్పిడి పురుషులను నియమించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌లో సాంఘిక సంక్షేమ శాఖ అభ్యర్థుల జాబితా మేరకు హైదరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్లకు కార్యక్రమాలు నిర్వహించారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో 58 మంది ట్రాన్స్‌జెండర్లు హాజరు కాగా, 44 మందిని ఎంపిక చేశారు.