శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 మే 2024 (11:26 IST)

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024.. నోటిఫికేషన్ విడుదల

Online Exams
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ - లెక్చరర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం అర్హత పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్‌సీహెచ్‌ఈ) చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి, ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ ప్రకటించారు. 
 
సెట్ పరీక్షలు ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించబడతాయి. మే 14 నుండి జూలై 2 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. జూలై 26 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను అపరాధ రుసుముతో సమర్పించవచ్చు. హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. వెబ్‌సైట్ ఆగస్టు 20,2024 నుండి ప్రారంభమవుతుంది.