గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జనవరి 2024 (18:18 IST)

ఆర్టీసీ ఉచిత ప్రయాణ ఎఫెక్టు : జట్టుపట్టుకుని.. పిడిగుద్దులతో కొట్టుకున్న మహిళలు...

women's fight
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం మహిళల మధ్య చిచ్చురేపింది. ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు చితక్కొట్టుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ గతంలో కంటే బాగా పెరిగింది. ఈ క్రమంలో పలు చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. 
 
తాజాగా జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ముగ్గురు, నలుగురు మహిళలు సీట్ల కోసం దారుణంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టి వెరల్ మారింది. మహిళలు తిట్టుకోవడం, జట్టుపట్టుకుని మరీ కొట్టుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
 
సోమవారం ఉదయం జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళుతున్న బస్సులో చాలా మంది జనం ఎక్కారు. కొంతమంది కూర్చోవడానికి సీటు దొరకని పరిస్థితి. ఈ క్రమంలో సీటు కోసం మహిళలు పోటీపడ్డారు. కొంతమంది కర్చీఫ్ వేసుకోగా, మరికొంతమంది కిటికీ నుంచి బస్సులోకి ఎక్కారు. ఈ క్రమంలో మగ్గురు నలుగురు మహిళలు కొట్టుకున్నారు. వారిని ఆపేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించారు.