బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (08:54 IST)

అన్ని కులాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి: బీజేపీ

అన్ని కులాల్లోని పేదలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఆయన హుజూరాబాద్‌ మండలంలోని పోతిరెడ్డిపేట, వెంకట్రావ్‌పల్లి, సిర్సపల్లి, రంగాపూర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన ఉద్యమకారులను టీఆర్‌ఎస్‌ పార్టీలోంచి వెళ్లగొట్టడం ఆనవాయితీగా మారిందని, మొన్న తనను, నిన్న ఈటల రాజేందర్‌ని వెళ్లగొట్టారని, రేపు హరీశ్‌రావును వెళ్లగొడుతారన్నారు. 

మంత్రి హరీశ్‌రావుకు ఈటల గెలవాలని ఉందని పోలీసులు తనతో చెప్పారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు రాముల కుమార్‌, ప్రధాన కార్యదర్శి వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.