శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 22 జూన్ 2018 (22:38 IST)

దారుణం.. ప్రమాదంలో కుటుంబం మొత్తం మృతి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి రాజీవ్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం చూసిన వారిని కంటతడి పెట్టిస్తుంది. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాలు లోకి వెళితే మంథనికి చెందిన ఆకుల వరు

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి రాజీవ్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం చూసిన వారిని కంటతడి పెట్టిస్తుంది. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాలు లోకి వెళితే మంథనికి చెందిన ఆకుల వరుణ్‌, సౌమ్య దంపతులు. వారి  పిల్లలు అఖిలేష్‌ కుమార్‌(10) శాన్వి(08)తో కలసి హైదరాబాద్‌ నుంచి  స్వస్థలానికి కారులో బయలుదేరారు.
 
వేగంగా ప్రయాణిస్తున్న వీరి కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. కారులో ఉన్న నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. కారు నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.