నాసా రోవర్ చాలెంజ్ పోటీలకు తెలంగాణ స్టూడెంట్స్ ఎంపిక

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (11:07 IST)

nasa

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. 'హ్యూమన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ రోవర్‌ చాలెంజ్‌' ఫైనల్స్‌లో ఐదుగురు విద్యార్థులు పోటీపడనున్నారు. అంతరిక్షానికి సంబంధించిన అంశాలపై ప్రతి ఐదేళ్లకోసారి నాసా ఈ పోటీలను నిర్వహిస్తూ వస్తోంది. 
 
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన పాల్‌ వినీత్, ప్రకాశ్‌ రాయినేని, శ్రవణ్‌రావు, దిలీప్‌రెడ్డి, స్నేహ ఈ టీమ్‌లో ఉన్నారు. వీరిని ప్రొఫెసర్ మనోజ్‌ చౌదరి గైడ్ చేస్తున్నారు. చంద్రుడిపై సురక్షితంగా మానవులు తిరిగేందుకు రోవర్‌ డిజైన్‌ను తయారు చేసి, నివేదిక అందించడంలో అనేక దశలు దాటుకుని వీరు ఈ స్థాయికి చేరుకున్నారని ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యం గురువారం తెలిపింది. 
 
‘వేరే గ్రహంపై తిరుగాడేందుకు అనువైన వాహనాన్ని తయారు చేయాలని ప్రతిష్టాత్మక నాసా చాలెంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల నుంచి పోటీ పడగా, దేశం మొత్తం మీద 4 బృందాలు ఎంపికయ్యాయి’ అని పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 12 నుంచి 14 వరకు అమెరికాలో హూస్టన్‌ విల్లేలోని అలబామా యూనివర్సిటీలో జరిగే నాసా పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన వారితో పాటు తమ విద్యార్థులు చంద్రుడిపై తిరిగేందుకు అనువైన రోవర్‌ను డిజైన్‌ చేసి తయారు చేస్తారని పేర్కొంది.  దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

"అచ్చే దిన్ కాదు.. ఆకలి భారతం"... 119 దేశాల్లో 100వ స్థానంలో భారత్‌

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. పైగా, అగ్రదేశాలతో ...

news

జయ్ అమిత్ షా ఆరోపణలవై విచారణ జరగాలి : ఆర్ఎస్ఎస్

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ ...

news

ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక... దినకరన్ మళ్ళీ పోటీ చేసేనా?

మద్రాసు హైకోర్టు ఆదేశం మేరకు డిసెంబరు 31వ తేదీలోగా చెన్నై, ఆర్కే నగర్ ఉప ఎన్నికను ...

news

బాణసంచా నిషేధం సరికాదు... రాందేవ్ : ఆన్‌లైన్‌లోనూ అమ్మకంపై నిషేధం

దేశ రాజధాని ప్రాంతంలో బాణసంచాపై నిషేధం విధించడంపై ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ ...