సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (12:08 IST)

తొర్రూరు గురుకుల పాఠశాలలో కోవిడ్ కలకలం.. 8మంది విద్యార్థులకు పాజిటివ్

corona
మహబూబా బాద్ జిల్లా తొర్రూరులోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 8 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. పాఠశాలలో మొత్తం 172 మంది విద్యార్థులు వుండగా, 39 మంది సిబ్బందికి ర్యాపిడ్ టెస్టులు చేయగా అందులో 8 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయించారు. ఇందులో ఒకరికి పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించి కరోనా పరీక్షలు చేయించారు.
 
వీరిలో 8 మంది విద్యార్థులకు పాజిటివ్‌ రాగా, వారి ఇళ్లకు పంపించినట్లు ప్రిన్సిపల్‌ జయశ్రీ వెల్లడించారు. మిగిలిన విద్యార్థులను ఓ గదిలో ప్రత్యేకంగా ఉంచామని, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురికావద్దని సూచించారు