Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పని ఉందని రమ్మన్నాడు. మత్తుమందిచ్చాడు. పని కానిచ్చాడు.. వీడి వృత్తి తగలడా?

హైదరాబాద్, శనివారం, 8 జులై 2017 (08:21 IST)

Widgets Magazine
minor girl rape

పనీ పాటా లేని పోకిరీలూ అదే పనిచేస్తున్నారు. కామనరం ఉబ్బిపోయిన వారూ అదే పని చేస్తున్నారు. చివరకు లాయర్ల వంటి ఉన్నత విద్యావంతులూ అదే పనిచేస్తున్నారు. వర్గాలకు అతీతంగా ఆడది కనిపిస్తే చాలు పట్టుకుని రేప్ చేసేస్తున్న ఈ పిదప బుద్దుల పీచమడిచే మార్గమేమిటి. ఇది యావత్ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. అరవై ఎళ్లు దాటిన న్యాయవాది రోడ్డుసైట్ పోకిరీలకంటే ఘోరంగా తన యింటికి పనికి వచ్చిన మహిళ పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఇక న్యాయం ఎవరినడిగాలి?
 
వృత్తి రీత్యా ఆయన న్యాయవాది. వయస్సు 60 ఏళ్లు. ఇంట్లో పని చేయాల్సి ఉంది వస్తావా అని ఒక మహిళను కోరి పిలిపించుకున్నాడు. సెక్యూరిటీ గార్డు సహాయంతో ఆమెకు మత్తుమందు ఇచ్చి ఇద్దరూ రేప్ చేశారు. ఆమె పోలీసులకు రిపోర్ట్ చేయడంతో ఈ మద పిచ్చి లాయర్, సెక్యూరిటీ గార్డు పరారీలో ఉన్నారు. 
 
వివరాల్లోకి వెళితే న్యూ నాగోల్‌లో నివసించే ప్రకాశ్‌ (60) వృత్తిరీత్యా న్యాయవాది. అతడి కుటుంబ సభ్యులందరూ కొద్దిరోజుల క్రితం కొంపల్లికి వెళ్లడంతో ప్రకాశ్‌ ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. తన ఇంట్లో పనిచేసేందుకు మనిషి కావాలని తనకు తెలిసిన సెక్యూరిటీ గార్డు కృష్ణ(35)కు చెప్పాడు. కృష్ణ తనకు తెలిసిన మరో సెక్యూరిటీ గార్డు ద్వారా యూసు్‌ఫగూడకు చెందిన మహిళ(43)ను జూన్‌ 29న ప్రకాశ్‌ ఇంటికి పిలిపించాడు. అయితే, ఆమెకు ఆహారంలో వారు మత్తు మందు కలిపి ఇచ్చారు. కొద్దిసేపటికి సృహకోల్పోవడంతో ఇద్దరు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అనంతరం ఆమెను రాత్రి యూసు్‌ఫగూడలో దింపివచ్చారు. వారం తర్వాత జరిగిన దారుణాన్ని బంధువుల దృష్టికి తీసుకెళ్లింది. వారి సూచన మేరకు ఆమె.. చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు జరుపుతున్నట్లు సీఐ గురురాఘవేందర్‌ వెల్లడించారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ కాలేజీలో 500 మంది గంజాయి దమ్ము గాళ్లేనట... అది కాలేజా లేక గంజాయి కొట్టా?

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి సరఫరా అయిన గంజాయిని హైదరాబాద్ కాలేజీలల్లో పోరగాళ్లు ...

news

భర్త అక్రమ సంబంధం.. బట్టలూడదీసి చెప్పుతో కొట్టింది. పాడుబుద్ధి మానలా

ఇది మరే దేశంలోనో జరిగిన ఘటన కాదు. సాక్షాత్తూ భారత్‌లోనే జరిగింది. ప్రేమించి పెళ్లి ...

news

సుఖం కోసం వచ్చాడు.. చూసి వలచాడు... బయటకు లాగాడు.. మంచిదే కానీ...

వేశ్యవృత్తిలో ఉన్నామెను ప్రేమిస్తున్నానంటూ హీరో వెంటపడటం, ఆమెను ఒప్పించి ...

news

నీ సుఖమే నే కోరుకున్నా.. మాజీ భార్యకు పెళ్లి చేసిన మాజీ భర్త

పర పురుషుడితో మాట్లాడుతోందని అనుమానం వస్తేనే చాలు కట్టుకున్న భార్యను అమాంతంగా నరికి ...

Widgets Magazine