కండోమ్ ప్యాకెట్లతో ప్రియురాలి ఇంటికి వెళ్ళాడు.. తల్లి చూసింది.. ఆ తరువాత..?
గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. సంవత్సరం పాటు గుట్టుచప్పుడు కాకుండా కలుసుకునేవారు. అయితే ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. ప్రియురాలిని ఏకాంతంగా కలిసేందుకు ఆమె ఇంటికే వెళ్ళిన ప్రియుడికి షాక్ ఎదురైంది. చివరకు ప్రాణాలు పోయేలా చేసింది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన ప్లంబర్ పనిచేసే శేఖర్ అదే ప్రాంతానికి చెందిన రేష్మతో యేడాది కాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. శేఖర్ అద్దెకు తీసుకున్న గదిలోనో.. లేకుంటే ప్రియురాలు ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఇద్దరూ ఏకాంతంగా కలిసేవారు. ఎప్పటిలాగే ప్రియురాలిని కలిసేందుకు రాత్రి ఆమె ఇంటికి వెళ్ళాడు శేఖర్. అయితే షాక్.. ప్రియురాలు రేష్మతోపాటు ఆమె తల్లి, సోదరుడు, సోదరి కూడా ఉన్నారు.
ఇంటికి ఎందుకు వచ్చావని శేఖర్‌ను ప్రశ్నించింది రేష్మ తల్లి. పండుగ శుభాకాంక్షలు చెబుదామని వచ్చామన్నాడు. ఇంతలో ఆమె సోదరుడు శేఖర్ జేబులో ఉన్న కండోమ్‌లను గమనించాడు. ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. వంటింట్లోని కత్తులతో శేఖర్‌పై దాడికి దిగారు. అతని పొట్టలో పొడిచాడు. దీంతో కిందపడిపోయాడు శేఖర్. ఆ తరువాత రేష్మ సోదరుడు శేఖర్‌ను గొంతు కోసేశాడు. ఆ తర్వాత అంతా పరారయ్యారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దారుణాన్ని పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.