గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జూన్ 2023 (13:50 IST)

మూడు నెలల గర్భిణీ.. రెండున్నరేళ్ల బాబుతో ఆత్మహత్య

హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అత్తారింటి వేధింపులు తాళలేక కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే... ఫిల్మ్ నగర్‌లో విశ్వనాథ్, శిరీష కుటుంబ సభ్యులు నివాసం వుంటున్నారు. వీరికి రెండున్నర ఏళ్ల బాలుడు మనీష్ వున్నాడు. వీరి జీవితం అన్యోన్యంగా బాగానే సాగిన వీరి జీవితంలో శిరీషకు కష్టాలు మొదలయ్యాయి. 
 
కానీ భరిస్తూ వచ్చిన శిరీష గర్భవతి అయ్యింది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా అత్తారింటి వేధింపుల నుంచి విముక్తి కలగలేదు. బాలుడు పుట్టినా వేధింపులు ఆగలేదు. అయితే శిరీష మళ్లీ మూడు నెలల గర్భిణీ అయ్యింది. 
 
గర్భిణీ అని తెలిసి కూడా అత్తింటి వేధింపులు భరించలేక ఆ తల్లి తన రెండున్నరేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఎంతకు శిరీష గదిలోంచి బయటకు రాకపోవడంతో భర్త విశ్వనాథ్ గదిలోకి వెళ్లి చూస్తే షాక్‌ గురయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.