మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (16:19 IST)

జాతకాలు పేరుతో విడదీసి అమ్మాయిని లైంగికంగా వేధించిన పూజారి

పెళ్లి ముహూర్తం కోసం పూజారి వ‌ద్ద‌కు వెళ్ళిన‌ జంట‌ను విడ‌దీసి యువ‌తిని లొంగ‌దీసుకునేందుకు య‌త్నించిన‌ ఘటన కొత్త‌గూడెంలో చోటుచేసుకుంది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చుంచుప‌ల్లి మండ‌లం విద్యాన‌గ‌ర్ కాల‌నీకి చెందిన‌ శరత్ అనే పూజారి స్థానికంగా ప్రజలకు జాత‌కాలు చెపుతూ వుంటాడు.
 
శ‌ర‌త్‌ను వివాహ‌ ముహుర్తం కోస‍ం ఓ ప్రేమ‌జంట‌ ఆశ్ర‌యించింది. యువ‌తి అందానికి ముగ్ధుడైన‌ శ‌ర‌త్ ఇద్ద‌రి జాత‌కాలు క‌ల‌వ‌టం లేద‌ని యువ‌కుడితో చెప్పి ఇరువురుని వేరే వివాహం చేసుకోవాలని ప్రోత్స‌హించాడు. అనంత‌రం యువ‌తితో నీది మ‌హ‌ర్జాత‌క‌మంటూ లొంగ‌దీసుకునే య‌త్నం చేశాడు. యువ‌తి ఒప్పుకోక‌పోయేస‌రికి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు.
 
యువ‌తిని ఫోన్లో బెదిరించాడు. అర్థరాత్రి వేళ‌లో లైంగిక‌ వాంఛ‌ తీర్చాలంటూ ఫోన్లో వేధించాడు. ఇక యువతి ఎన్నిసార్లు  ప్రాధేయపడ్డప్పటికీ పూజారి మాత్రం పట్టించుకోలేదు. ఇంటికి వచ్చి ఇబ్బందులు పెట్టేందుకే ప్రయత్నించాడు. యువతి ప్రాణ‌భ‌యంతో చుంచుప‌ల్లి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.
 
యువ‌తికి మ‌హిళా సంఘాలు స‍ంఘీబావం ప్ర‌క‌టించాయి. న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. వేధించిన‌ వ్య‌క్తిని మ‌హిళా సంఘాల‌ నేత‌లు నిల‌దీశారు. పూజారి శ‌ర‌త్ పైన పోలీసులు   కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.