అలెర్ట్ : హైదరాబాద్ నగరానికి వర్ష హెచ్చరిక
హైదరాబాద్ మహానగరానికి వచ్చే రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా, రామంతాపూర్, మలక్‌పేట్, సీతాఫల్‌మండి, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నాలాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
దీంతో డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు బుధవారం తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు వర్షపునీటితో జలమయమైన విషయం తెల్సిందే. అయితే, ఈ ఆకస్మిక వర్షాల కారణంగా నగరంలో వాతావరణం కాస్త చల్లబడింది.