శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ESHWAR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (12:19 IST)

సచివాలయంలో చెట్ల కిందనే ఏపీ జర్నలిస్టులకు చోటు..!

ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్ కవర్ చేసే మీడియా వారికి సి బ్లాక్ ఎదురుగా మీడియా లాంజ్ ఉండేది. అది కూడా పాత్రికేయ మిత్రులు, కెమెరా‌మెన్లు  ముఖ్యమంత్రులుకూ, అధికారులకూ మొరపెట్టుకోగా రోశయ్య హయాంలో మీడియా లాంజ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మీడియా లాంజ్ తెలంగాణా సెక్రటేరియట్‌కు కేటాయించగా.. ఏపీ సెక్రటేరియట్ మీడియాలకు కనీసం ఒక రూం కూడా కేటాయించలేదు. 
 
ఏపీలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మీడియా పాయింట్‌తో పాటు పబ్లిసిటీ సెల్ లేక పోవడంతో ఎల్ బ్లాక్ మందు చెట్ల క్రింద మీడియా ప్రతినిధులు పడిగాపులు కాయల్సిన దుస్థితి ఏర్పడింది. స్వయంగా ముఖ్యమంత్రితో పాటు సీఎస్‌లు మీడియాకు కనీస సౌకర్యాలు కేటాయించాలని సూచించినా తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో మీడియా ప్రతినిధులు సైతం చెట్ల కిందే కూర్చుంటున్నారు.