గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (10:03 IST)

వినాయక చతుర్థి.. మాంసం విక్రయాలు నిలిపివేతపై ఓవైసీ ఫైర్

వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ నెల 31న మాంసం విక్రయాలు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. 
 
మాంసం విక్రయాల్ని నిషేధించే నిర్ణయం ప్రభుత్వానికి మంచిదే కావొచ్చునని తెలిపారు. కానీ, దీనిపై ఆధారపడి జీవిస్తున్న ఎంతోమందికి ఇబ్బంది కలిగిస్తుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
వినాయక చవితి సందర్భంగా బెంగళూరు పరిధిలోకి వచ్చే ప్రతి మాంసం విక్రయ కేంద్రాన్ని, కబేళాల్ని మూసివేయాలని ఇటీవలే బెంగళూరు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.