మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్‌లో చేరాలన్నదే కేసీఆర్ వ్యూహ : బండి సంజయ్

bandi sanjay
ఇపుడు తెరాస నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరి.. వచ్చే ఎన్నికల్లో వారంతా విజయం సాధించి మళ్లీ భారత రాష్ట్ర సమితిలో చేరాలన్నదే సీఎం కేసీఆర్ వ్యూహమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి సీఎం కేసీఆర్‌ మరోసారి లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ విమర్శించారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా ‘ఇంటింటికీ భాజపా’ కార్యక్రమానికి భాజపా శ్రీకారం చుట్టింది. ఒక్కో కార్యకర్త పోలింగ్‌బూత్‌లో వంద కుటుంబాల వద్దకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించారు. దీనిలో భాగంగా కరీంనగర్‌లోని చైతన్యపురి 173వ పోలింగ్‌ బూత్‌ పరిధిలోని ప్రజలతో సంజయ్‌ మమేకమయ్యారు. 9 ఏళ్ల మోడీ పాలనను వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు.  
 
అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ.. 'రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరులకు కేసీఆర్‌ నివాళులర్పించలేదు. కేసీఆర్.. ఇవాళ ఏదో జిమ్మిక్కులు చేస్తారు. మేం టీవీలు పెట్టుకొని చూస్తాం. ధరణి బాధితులను పిలిస్తే పరేడ్‌ గ్రౌండ్‌లో పెద్ద సభే అవుతుంది. ఆ పథకాన్ని పూర్తిగా తన కుటుంబ అవసరాలకు ఉపయోగించుకున్నారు. 
 
కాంగ్రెస్, భారాస కలిసి మొదటి విడతగా 30 మంది అభ్యర్థులను ఎంచుకున్నాయి. వారికి కేసీఆర్‌ ఫండింగ్ ఇస్తున్నారు. కాంగ్రెస్ లో గెలిస్తే తిరిగి భారాసలోకి రావడానికే ఈ వ్యూహం. కేసీఆర్‌కి భారాస అభ్యర్థుల కంటే కాంగ్రెస్ మీదనే నమ్మకం ఉంది. కాంగ్రెస్‌లో ఉన్నోళ్లందరూ మావాళ్లే అనే ఫీలింగ్‌లో కేసీఆర్‌ ఉన్నారు’’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.