Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాలుగు నెలలకో అమ్మాయి... శిరీషకు పనిభారం పెంచి వంచించిన రాజీవ్(వీడియో)

శుక్రవారం, 16 జూన్ 2017 (17:21 IST)

Widgets Magazine

విజయలక్ష్మి అలియాస్ శిరీష ఓ మధ్యతరగతి గృహిణి. భర్తతో పాటు హైదరాబాద్ నగరానికి పొట్ట చేతబట్టుకుని వచ్చారు. చిన్నచిన్న ఉద్యోగాలతో ఏదో బతికేద్దాం అనుకున్నారు. ఈ క్రమంలో శిరీష బ్యూటీషియన్‌గా ఓ షాపు పెట్టింది. ఐతే అది అంతగా రాణించలేదు. ఇంతలో ఆర్జే ఫోటో స్టూడియో యజమాని రాజీవ్ ఓ ఫంక్షనులో ఆమెకు పరిచయమయ్యాడు. 
sirisha
 
శిరీష ఆ ఫంక్షనులో అమ్మాయికి మేకప్ వేసేందుకు వెళ్లగా... అక్కడే ఇతడు పరిచయమయ్యాడు. దాంతో వెంటనే... తన షాపులో పనిచేసేందుకు ఓ మహిళ కావాలంటూ మెల్లగా ఆమెను ముగ్గులోకి దింపాడు. అసలే ఆర్థిక సమస్యలతో వున్న శిరీష... షాపులో పనిచేసేందుకు ఒప్పుకుంది. కొంతకాలం ఆఫీసులో అంతా సక్రమంగానే వున్నట్లు అనిపించినా క్రమక్రమంగా ఆమెకు పనిభారాన్ని పెంచాడు రాజీవ్. 
 
ఇంట్లో గడిపే పని గంటల కంటే ఆఫీసులోనే ఎక్కువ సమయం వుండేట్లు చేశాడు. అలాఅలా ఆమెను లోబరుచుకున్నాడు. ఆమెతో గత నాలుగేళ్లుగా శారీరక సంబంధం పెట్టుకున్న రాజీవ్ ఎంతోమంది అమ్మాయిలకు వల వేసేవాడని అతడి షాపుకు ఇరుగుపొరుగున వున్నవారు చెప్పడం గమనార్హం. అతడి చేతిలో మోసపోయిన అమ్మాయిలు పరువు పోతుందని వాస్తవాల్ని చెప్పడంలేదని సమాచారం. 
 
తేజస్వినిని కూడా అలాగే రాజీవ్ మోసం చేశాడని అంటున్నారు. కాగా ఓ యువతి ఆర్థిక ఇబ్బందులను ఆసరా చేసుకుని ఆమెను వంచించడమే కాకుండా ఆమె చావుకు కూడా కారణమయ్యాడు రాజీవ్. ఇక శ్రావణ్ మేకవన్నె పులి. తన మిత్రుడు ఎస్సై ప్రభాకర్ రెడ్డికి శిరీషను అప్పగించేద్దామన్న కుట్రతో ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు. అతడి పథకం బెడిసికొట్టడంతో అటు ప్రభాకర్ రెడ్డి శవమయ్యాడు. ఇటు ఇతడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. మరోవైపు పొట్ట చేతబట్టుకుని వచ్చిని మహిళ శిరీష ప్రాణం తీసుకుంది. కేసు వివరాలు.... క్రింది వీడియోలో....Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
#beautician #suicide #sirisha

Loading comments ...

తెలుగు వార్తలు

news

శిరీషపై ఎస్ఐ అత్యాచారం చేయలేదు సరే.. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టు?

హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీషపై కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచారానికి ...

news

అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో తొలి భారతీయుడు.. ఐసిస్‌ కోసం ఆ పనిచేశాడు..

భారత్‌ నుంచి ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ఉగ్రమూకలను తరలించిన కర్ణాటకకు చెందిన మొహ్మద్ షఫీ ...

news

రాజీవ్‌తో శిరీషకు 4 ఏళ్లుగా అక్రమ సంబంధం... ఎస్సై రేప్ చేయబోయాడు... సీపీ మహేందర్

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యకు సంబంధించి హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ...

news

బహిరంగంగా ముద్దాడుతుంటే అభ్యంతరం చెప్పాడనీ హతమార్చారు.. ఎక్కడ?

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేవలం మాఫియా నేరాలే కాదు.. సాధారణ యువకులు యధేచ్చగా నేరాలు ...

Widgets Magazine