బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 19 జులై 2021 (09:48 IST)

సెప్టెంబర్ 10న భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలు ప్రారంభం

సెప్టెంబర్ 10న గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి జనరల్ సెక్రెటరీ భగవంత్‌ రావు తెలిపారు. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు చాలా జాగ్రత్తలు తీసుకొని నిర్వహిస్తామని తెలిపారు.

ఈ నెల 23న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ఆఫీస్ ఓపెన్ చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 10న గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతాయని... 19 ఆదివారం నిమిజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ‘‘ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. రా మెటీరియల్  టైమ్‌కి ఇవ్వాలి అని కోరుతున్నాం’’ అని ఆయన అన్నారు. 

గణేష్ ఉత్సవాలకు 24 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉపయోగిస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ రోడ్డులు బాగు చేయలని.. నిమిజ్జనమ్ సమయానికి బాగా ఉండేలా చేయాలని వినతి చేశారు. 

గణేష్ ఉత్సవాలు సమయంలో విద్యుత్ సరఫరాపైనా దృష్టి పెట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కరోనా గైడ్లైన్స్ ప్రకారం మండపంలో అన్ని జాగ్రత్తలు చేపడతామన్నారు. గణేష్ విగ్రహం ఎత్తు కోసం పోటీ పడకుండా.. కరోనా గైడ్లైన్స్ చూస్తూ జాగ్రత్తగా చేసుకోవాలని సూచించారు.